Header Banner

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

  Tue May 13, 2025 11:43        Politics

వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% స్థానికేతర (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లనూ రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా.. ఇక నుంచి ఈ సీట్లకు పోటీ పడటానికి తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం వేర్వేరుగా మూడు ఉత్తర్వుల (జీవో -20, 21, 22)ను జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15% కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లు 70%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత ఏపీలో రెండు రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ, విభజన అనంతరం 10 ఏళ్ల పాటు ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేపట్టగా.. ఇప్పుడు ఉస్మానియా రీజియన్ న్ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!

 

ఆంధ్ర రీజియన్లో ఎవరొస్తారంటే..

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్ (ఏయూ) పరిధిలో ఉంటాయి. ఇక్కడి విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఏయూ రీజియన్కు లోకల్గా పరిగణిస్తారు.

శ్రీవేంకటేశ్వర రీజియన్ లో ఇలా..

ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ రీజియన్లో ఉంటాయి. ఈ జిల్లాల వారిని శ్రీవేంకటేశ్వర రీజియన్లో లోకల్గా పరిగణిస్తారు.

రాష్ట్ర విద్యా సంస్థలు..

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రావిడ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఆర్జీయూకేటీ, క్లస్టర్ విశ్వవిద్యాలయంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల రాష్ట్ర విద్యా సంస్థలుగా ఉంటాయి. 85% స్థానిక కోటాలో ఆంధ్ర రీజియన్ వారికి 65.62%, ఎస్వీయూ రీజియన్ వారికి 34.38% సీట్లు కేటాయిస్తారు. మిగతా 15% సీట్లను స్థానికేతర, జనరల్ కోటాలో భర్తీ చేస్తారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations